జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ వల్లే క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్‌అబూ (రాజస్థాన్), మార్చి 26: ప్రస్తుత పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌నుంచే విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్చుకున్నానని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ చెప్పారు. ‘నేను కరాచీలో పుట్టాను. అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్చుకున్నాను. మనం ఎప్పుడు కూడా తప్పులను ప్రోత్సహించకూడదనే విషయాన్ని నేను ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి నేర్చుకున్నాను. ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే దేశభక్తి, అంకితభావాన్ని మేము నేర్చుకున్నాం’ అని ఇక్కడ జరుగుతున్న బ్రహ్మకుమారీస్ 80వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన అద్వానీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి దేశ విదేశాలనుంచి ఇప్పటికే వేలాది మంది వౌంట్ అబూకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేడుకలను ప్రారంభించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ పిజె కురియన్, ఎల్‌కె అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, అసోం, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మీడియా ప్రముఖుడు రజత్ శర్మ, బాలీవుడ్ నటీమణులు రవీనా టాండన్, గ్రేసీసింగ్ కూడా హాజరవుతున్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. బ్రహ్మకుమారీస్ ప్రపంచంలోనే పూర్తిగా మహిళల చేత నిర్వహించబడే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. వౌంట్ అబూ ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ సంస్థను 1937లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 8,500కు పైగా ధ్యానకేంద్రాలున్నాయి. బ్రహ్మకుమారీస్ పరిపాలనా వ్యవహారాల చీఫ్ 101 ఏళ్ల దాదీ జానకి, అడిషనల్ చీఫ్ దాదీ హృదయ మోహిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేశాన్ని వినిపిస్తారు.