జాతీయ వార్తలు

ప్రకాశం బ్యారేజి పూడికతీత పనులపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: కృష్ణానది ప్రకాశం బ్యారేజీలో పూడికతీత పనులుపై అధ్యయనం చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్టును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపి, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ మంగళవారం విచారణ జరిపింది. బ్యారేజీలో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల నుంచి పూడికతీత పనులకు మినహాయింపు ఇవ్వాలని ఏపి ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ పూడికతీత పనుల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రకాశం బ్యారేజీలో గత 57 ఏళ్లుగా పూడికతీత జరపలేదని, అందువల్ల ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నట్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది ట్రిబ్యునల్‌కి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో పూడికతీత పనులు అవసరమా లేదా అన్న దానిపై అధ్యయనం జరపాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.