జాతీయ వార్తలు

మోదీ, యోగి ఉపవాస దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లక్నో, మార్చి 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చైత్ర నవరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టారు. ఇద్దరు నేతలు దుర్గాదేవి భక్తులన్న సంగతి తెలిసిందే. దసరా నవరాత్రి సందర్భంగా కూడా ఇద్దరూ దీక్ష చేపట్టడమూ విదితమే. మంగళవారం నుంచి దీక్ష ప్రారంభం కావటంతో తదుపరి తొమ్మిది రోజులూ వేడినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను మాత్రమే మోదీ స్వీకరిస్తారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు వైష్ణోదేవి అమ్మవారికి పూజ చేసిన తరువాతే ఆయన ఈ దీక్షలు ప్రారంభించారు. ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత కూడా 2014 సెప్టెంబర్‌లో అమెరికాకు వెళ్లినప్పుడు సైతం ఆయన నవరాత్రి దీక్షను కొనసాగించారు. ప్రస్తుతం లోక్‌సభలో జిఎస్టీ బిల్లు ఆమోదానికి ఎదురుచూస్తున్న తరుణంలో మోదీ దీక్ష మొదలైంది.
ఇక యోగి ఆదిత్యనాథ్ దుర్గాదేవి భక్తుడు. గోరఖ్‌నాథ్ మఠానికి మహంత్. ఇప్పుడు దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ తన సంప్రదాయాన్ని, ఆచారాల్ని దీక్షలను కొనసాగించాలనే ఆయన నిర్ణయించుకున్నారు. అధికారిక విధులను నిర్వహిస్తూనే ఆయన దీక్ష కొనసాగిస్తారు. అయితే మోదీ అంత కఠినంగా ఈయన దీక్ష చేయరు. ఆయన పాలతో తయారైన పదార్థాలు, పండ్లను స్వీకరిస్తారు. యోగి ఆదిత్యనాథ్ నాథ్ సంప్రదాయానికి చెందినవారు. ఎనిమిదో రోజు హవనం చేసి కన్యాపూజను నిర్వహిస్తారు.