జాతీయ వార్తలు

రోదసిలో మన దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: మనకు సొంత దిక్సూచి వచ్చేసింది. మొత్తం ఏడు ఉపగ్రహాల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ప్రయోగ విజయంతో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం సాధించిన తలమానికమైన విజయం భారత్‌కు సొంత జిపిఎస్ వ్యవస్థ చేకూరేలా చేసింది. స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లోని ఏడో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ని శాస్తవ్రేత్తలు గురువారం దిగ్విజయంగా రోదసీ కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర సతీష్ థవన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుండి గురువారం మధ్యాహ్నం 12:50గంటలకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇస్రోకు నమ్మిన బంటు అయిన పిఎస్‌ఎల్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా మోసుకెళ్లింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహ వ్యవస్థ భూతలం, ఆకాశం, సాగరాల్లో స్పష్టమైన సేవలందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలో సాయపడుతుంది.
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థలో ఇది ఏడో ఉపగ్రహం కావడం..దీన్నీ విజయవంతంగా ప్రయోగించడంతో భారత దేశ చిరకాల వాంఛ నెరవేరింది. మంగళవారం ఉదయం 9:20గంలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 51:30గంటలు సాఫీగా సాగి మైనస్ 0కు చేరగానే...గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12:50గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అంచనాలకు తగ్గట్టుగానే..అద్భుతంగా నాలుగు దశలు రాకెట్ పయనం విజయవంతంగా సాగిపోయింది. ఈ ప్రయోగం కోసం పిఎస్‌ఎల్‌వికి సంబంధించిన ఎక్స్‌ఎల్ వెర్షన్ మోటార్లను ఇస్రో ఉపయోగించింది. ఇందులో ఆరు ఘన రాకెట్ స్ట్రాపాన్ మోటార్లను వాహక నౌకకు అనుసంధానించారు. దీని వల్ల మొదటి దశలో అదనపుశక్తి లభించింనట్లయింది. ఈ వెర్షన్ గల మోటార్లను ఇస్రో ఉపయోగించడం ఇది 13వ సారి. ఇంతకు ముందు చంద్రయాన్-1 మొదటి సారి ఉపయోగించారు. అనంతరం జీశాట్-12, రీశాట్, ఆస్ట్రోశాట్, మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ,1బి,1సి,1డి, 1ఈ,1 ఎఫ్, 1జి ప్రయోగాలకు దీన్ని వాడారు. తాజా ప్రయోగానికి కూడా ఎక్స్‌ఎల్ తరహా మోటార్లను వాడి విజయవంతం చేశారు. ప్రయోగం జరిగిన 20.19నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి నిర్ధేశిత కక్ష్యలోకి చేర్చింది. 284+ 20657 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార ఉప బదిలీ కక్ష్యలోకి ఉపగ్రహం చేరింది. షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్న ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుగానే శాస్తవ్రేత్తలు కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే ఇస్రో చైర్మన్ ఎ ఎస్.కిరణ్‌కుమార్ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమని ప్రకటించి శాస్తవ్రేత్తలకు అభినందలు తెలిపారు.