జాతీయ వార్తలు

వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలోని పలనాడు, వినుకొండ, మాచెర్ల, గురజాల తదితర ప్రాంతాలలోని ఆరు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. రాయపాటి సాంబశివరావు గురువారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాన మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ దీని నిర్మాణం పూర్తి చేస్తే 253 నివాస ప్రాంతాలకు తాగునీరు అందుతుందని సాంబశివరావు ప్రధానికి వివరించారు. పలనాడు తదితర ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు గిరిజనులు, హరిజనులేననీ, వీరు చాలా సంవత్సరాల నుండి తాగు నీటి సౌక ర్యం లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన మోదీకి వివరించారు. ఈ ప్రాంతంలోని జలాలు కలుషితమైనందున వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయవలసి ఉన్నదని ఆయన చెప్పారు. ప్రధాని చెప్పినదంతా సావధానంగా విన్న తరువాత ఈ ప్రాంతం ప్రజలకు తాను చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చినట్లు సాంబశివరావు తెలిపారు. ప్రజల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మోదీ చెప్పారని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్!
ఖమ్మం జిల్లాలోని పునుకుడుచెలక గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి అందిందని, ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉన్నదని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ వై.ఎస్.ఆర్.సి.పి సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ విధానం ప్రకారం సాధికారత నివేదికను సంబంధిత రైట్స్ లిమిటెడ్ సంస్థ నుండి రక్షణ శాఖ, పర్యావరణం, అటవీ తదితర శాఖలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిమార్కుల కోసం పంపించినట్లు శర్మ వివరించారు. సంబంధిత శాఖల నుండి అనుమతులు పొందిన తరువాతనే ప్రాజెక్టుకు క్లియరెన్స్ లభిస్తుందని మంత్రి వివరించారు.
వీబాక్స్ సర్వే ఆలోచన లేదు
తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వీబాక్స్ సర్వేను నిర్వహించటం లేదా దీనికి అవసరమైన ఆర్థిక సహాయం చేసే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి దత్తాత్రేయ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డికి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.