జాతీయ వార్తలు

విద్రోహ చర్యలపై మరింత నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రైల్వే ఆపరేషన్లకు విద్రోహం తలపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను భగ్నం చేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) తన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేయనుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర సంస్థలతో సమన్వయం చేసుకోనుంది. దీంతోపాటు రైల్వేలు ఒక ఫోరెన్సిక్ లేబొరేటరీని నెలకొల్పనున్నాయి. రైలు ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నాయి. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ఇక్కడ ఆర్‌పిఎఫ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇటీవలి కాలంలో రైల్వే ట్రాక్‌లపై తరచుగా ఆటంకాలు సృష్టించడం, దుర్మార్గులు రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేస్తుండటం వంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఇలాంటి విద్రోహ సంఘటనలు సుమారు 20 జరిగాయి. ‘దేశంలో రైలు ఆపరేషన్లకు విద్రోహం తలపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు, ఎన్‌ఐఎతో ఆర్‌పిఎఫ్ సమన్వయం చేసుకొని ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేయడానికి కృషి చేస్తోంది’ అని సురేశ్ ప్రభు అన్నారు. విద్రోహ ఘటనలను నివారించేందుకు ఆర్‌పిఎఫ్ తన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను, సమాచారాన్ని పంచుకునే వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఆర్‌పిఎఫ్‌కు చెందిన 43 మంది అధికారులు, సిబ్బందికి మంత్రి ఈ సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఆర్‌పిఎఫ్ ఆపరేషన్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ‘విధానాల చట్రంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించు కోవలసిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. రైల్వే తన ఆపరేషన్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ఒక టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్‌పిఎఫ్ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అలాగే ఒక కేంద్రీకృత డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.