జాతీయ వార్తలు

అనవసర జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, ఏప్రిల్ 1: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం భారత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు విమర్శించారు. దలైలామా వచ్చేవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 4, 13 తేదీల్లో ఆయన అరుణచల్‌లో పర్యటిస్తారు. టిబెట్ బహిష్కృత నేత భారత్‌లో ఎలా పర్యటిస్తారని చైనా ప్రశ్నిస్తోంది. అంతేకాక ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతమని కూడా చైనా హెచ్చరించింది. దలైలామా పర్యటనపై పునరాలోచించుకోవాలని భారత్‌కు స్పష్టం చేసింది. బౌద్ధమత గురువు పర్యటన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు బీజింగ్ పాలకులు తేల్చిచెప్పారు. కాగా చైనా తీరుపై భారత్ మండిపడుతోంది. ‘మేం మీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. మీరూ మా అంతర్గత విషయాల్లో కలగచేసుకోడం మానుకోండి’ అని రిజిజు చైనాకు సలహా ఇచ్చారు. ఇక్కడ ప్రజల కోరికమేరకే దలైలామా పర్యటనకు వస్తున్నారని మంత్రి అన్నారు. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం వల్ల చైనాకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని హోమ్‌మంత్రి పేర్కొన్నారు.