జాతీయ వార్తలు

భాగవత్‌ను రాష్టప్రతి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 1: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను రాష్టప్రతి చేయాలంటూ కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత సికె జాఫర్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. ‘్భగవత్ దేశభక్తిని శంకించాల్సిన పనిలేదు. అలాగే రాజ్యాంగం పట్ల ఎంతో అంకితభావం ఉన్నవారు’ అని షరీఫ్ స్పష్టం చేశారు. రాష్టప్రతి కావడానికి అవససరమైన అన్ని అర్హతలూ భగవత్‌కు ఉన్నాయంటూ మార్చి 29న ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ రైల్వే మంత్రి పేర్కొన్నారు. ‘్భగవత్ అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించరన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దేశాధ్యక్ష పదనికి అవసరమైన అన్ని అర్హతలూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఉన్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత ఆ లేఖలో తెలిపారు. భాగవత్ రాష్టప్రతి అయితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని షరీఫ్ అభిప్రాయపడ్డారు. శివసేన తరువాత భగవత్‌ను రాష్టప్రతిని చేయాలని డిమాండ్ చేస్తున్న బిజెపియేతర నేత షరీఫ్. అయితే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను రాష్టప్రతి చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు అది వ్యతిరేకమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని షరీఫ్ దగ్గర ప్రస్తావిస్తే నిబద్ధత ఉన్న నేత భగవత్, అందుకే ఆయన రాష్టప్రతి అయితే మంచిదన్నది తన అభిప్రాయం అని అన్నారు. త్వరలోనే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. ప్రణబ్ స్థానంలో భాగవత్ రాష్టప్రతి అవుతారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే తాను రాష్టప్రతి రేసులో లేనని భాగవతే స్వయంగా ప్రకటించారు. కాగా రాజకీయ పార్టీలన్నీ విశాల దృక్పధంతో ఆలోచించి భగవత్‌కు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేత షరీఫ్ విజ్ఞప్తి చేశారు.