జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 2: ప్రధాని ఆదివారం ప్రారంభించిన చెనాని నష్రీ సొరంగ మార్గం ఆసియాలోనే అతి పెద్దది. 10.89 కిలోమీటర్ల పొడవైన ఈ టనె్నల్ జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని రెండు రాజధానులైన జమ్ము-శ్రీనగర్‌లను అనుసంధానం చేస్తోంది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే సమయం దాదాపు రెండు గంటల పాటు తగ్గుతుంది. ఈ రహదారిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆసియాలో రెండు వైపులా ప్రయాణం చేసే హైవే సొరంగమార్గం ఇది. జమ్ము-శ్రీనగర్‌ల మధ్య ప్రయాణాన్ని 350 కిలోమీటర్ల నుంచి 250కిలోమీటర్లకు తగ్గిస్తుంది.
10.89 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారి నిర్మాణానికి రూ.2519కోట్ల రూపాయల ఖర్చు అయింది.
ప్రపంచంలోనే గాలి లోపలికి బయటకు వెళ్లేందుకు వీలుగా ఏబిబి సాఫ్ట్‌వేర్ నియంత్రణతో ఉండే వెంటిలేషన్ వ్యవస్థ ఉన్న ఆరో సొరంగ మార్గమిది.
ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, వీడియో నిఘా వ్యవస్థ, ఎఫ్ ఎం రేడియో, అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థలు ఉన్నాయి.
124 సిసి టివి కెమరాలు టనె్నల్‌లో అమర్చారు.
ఏ వాతావరణ పరిస్థితిలోనూ ఇందులో సురక్షితంగా ప్రయాణించవచ్చు
కాశ్మీర్‌ను మంచు కమ్మేసినా ఈ సొరంగ మార్గంలో ప్రయాణానికి ఎలాంటి అంతరాయం ఏర్పడదు.
కనీవినీ ఎరుగని రక్షణ చర్యలు ఇందులో ఉన్నాయి. ప్రధాన ట్రాఫిక్ టనె్నల్ 13మీటర్ల వ్యాసంలో ఏర్పాటు చేశారు. మధ్య మధ్య విరామ ప్రాంతాల్లో 29 రహదారిని దాటేందుకు ఏర్పాటు చేశారు.
వాహనం చెడిపోతే పక్కన పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
ఈ దారిలో రవాణా వల్ల రోజుకు రూ.27 లక్షలు, సంవత్సరానికి 99కోట్ల రూపాయల ఇంధనం ఆదా అవుతుంది.
జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామ్‌లకు చెల్లుచీటీ పాడినట్లవుతుంది.
కార్లు టోల్ చార్జి ఒక వైపు రూ.55, రెండు వైపుల రూ.85 చెల్లించాల్సి ఉంటుంది. నెల వారీ పాస్ తీసుకుంటే రూ.1870రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.