జాతీయ వార్తలు

ముడుపులు ఎవరు తీసుకున్నారో తేలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 28: ప్రముఖులు ప్రయాణించడం కోసం అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రూ. 3,600 కోట్లకు పైగా ముడుపులు ఎవరు తీసుకున్నారో వారి పేర్లు బైటికి వచ్చి తీరాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఈ సొమ్ము ఎవరు తీసుకున్నారో వెలుగులోకి రావాలి’ అని గురువారం ఇక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ చెప్పారు. ‘2జి, 3జి, హెలికాప్టర్లు.. కాంగ్రెస్ హయాంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కుంభకోణాలు జరిగాయి’ అని ఆయన అంటూ, అవినీతికి సంబంధించి అటల్ బిహారీ వాజపేయి పాలనలో కానీ, నరేంద్ర మోదీ హయాంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపించ లేరని ఆయన అన్నారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతిపై మీ వైఖరేమిటో స్పష్టం చేయాలని పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న సిపిఎంను ఆయన డిమాండ్ చేశారు. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు పరస్పరం పోటీ పడుతుంటే పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరివర్తన (మార్పు) తీసుకు వస్తామన్న నినాదంతో అయిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి మార్పూ తీసుకు రాలేక పోయిందని ఆయన విమర్శించారు. అంతేకాదు మమతా బెనర్జీ ‘మా- మాటి- మనుష్’ నినాదం కూడా ఇచ్చారని ఆయన అంటూ, అయితే తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ మూడింటిలో దేనికీ భద్రత లేదని అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన అంటూ, ఇక్కడ బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే మూడు పువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లుతోందన్నారు.