జాతీయ వార్తలు

‘అవమానం’ నివేదిక కోరిన సుష్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక, ఏప్రిల్ 2: అమెరికాలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో బెంగళూరు నుంచి ఐస్‌ల్యాండ్‌కు వెళ్తున్న ఓ భారతీయ మహిళపై అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు దారుణంగా వ్యవహరించారు. శృతి బసప్ప అనే ఈ మహిళ తనను ముందుగా పూర్తి బాడీ స్కాన్ చేశారని అందులో ఏమీ లేదని స్పష్టమైందని, అయినా అధికారులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేయటంతో తడిమి చూసేందుకు అంగీకరించానని తెలిపారు. తాను రెండు వారాల క్రితమే కడుపు ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపినా వినిపించుకోలేదు. ‘‘వాళ్లు నా డ్రస్ తీసేయమన్నారు. ఇదేమైనా కొత్త నిబంధనా, క్యూలో ఉన్నవారిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుని వాళ్లను ఈ విధంగా వేధించటం ఏ రకంగా సబబు.. బ్రౌన్ రంగున్న ప్రజలు అనుమానాస్పదులు కాదా? యురోపియన్ భాగస్వాములు లేకపోతే మా పరిస్థితి ఏమిటి?’’ అని ఆమె ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. తన భర్తను గదిలోకి రప్పిస్తే తప్ప ఏ పరీక్షకూ అంగీకరించేది లేదని అధికారులకు చెప్పటంతో అధికారులు ఆమె భర్తను పిలిపించారు. ఆయన ఐస్‌లాండ్ దేశస్థుడు కావటంతో అధికారులు వెనక్కి తగ్గారు. పరీక్షను నామమాత్రంగా జరిపి వదిలేశారు. ఈ ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని భారత దౌత్య అధికారులను కోరారు.