జాతీయ వార్తలు

నిన్న మీరట్.. నేడు వారణాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఏప్రిల్ 3: నిన్న మీటర్.. నేడు వారణాసి. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాలంటూ వారణాసి మేయర్ రామ్‌గోపాల్ మొహాలే ఆదేశించారు. శనివారంనాడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బిజెపి సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్పొరేటర్ల నిరసనల మధ్యే మేయర్ ఆదేశాలు జారీచేశారు. గతవారం మీరట్ మున్సిపల్ సమావేశంలోనూ జాతీయ గీతంపై గందరగోళం తలెత్తగా సభ్యులు కచ్చితంగా వందేమాతరం, జనగణమన పాడాలంటూ మేయర్ హరికాంత్ అహ్లూవాలియా ఆదేశించిన సంగతి తెలిసిందే. లేనిపక్షంలో అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అలాగే వారణాసి మున్సిపల్ సమావేశం ప్రారంభంకాగానే బిజెపి కార్పొరేటర్ అజయ్ గుప్తాలేచి సభ్యులంతా జాతీయ గీతం ఆలపించాలని, దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుప్తా డిమాండ్‌పై కాంగ్రెస్, ఎస్‌పి సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మేయర్ రామ్‌గోపాల్ మొహాలే జోక్యం చేసుకుంటూ సమాశాల్లో వందేమాతరం, జనగణమన గీతాలు కచ్చితంగా పాడాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే 2017-18 మున్సిపల్ బడ్జెట్‌పై చర్చించేందుకు తాము సన్నద్ధమవుతుంటే బిజెపి సభ్యుడు అజయ్ గుప్తా జాతీయగీతం అంశాన్ని ఆశ్చర్యంగా తెరమీదకు తెచ్చారని ఎస్‌పి కార్పొరేటర్ రవికాంత్ విశ్వకర్మ విరుచుకుపడ్డారు. సమావేశానికి ముందు జాతీయగీతం పాడాలన్న అధికార పార్టీ నిర్ణయం ఏకపక్షమని, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం, హిందూ కార్పొరేటర్లు, కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ‘మాకూ దేశభక్తి అంటే ఏమిటో తెలుసు. దానిపై మాకెంతో గౌరవం ఉంది. వారు (బిజెపి) వచ్చి కొత్తగా మాకు నేర్పనక్కర్లేదు. బలవంతపెట్టి మాతో జాతీయ గీతం పాడించాలనుకోవడం దారుణం’ అని రవికాంత్ చెప్పారు. సభలో జాతీయ గీతం ఆలపించడం అన్నది కొత్త సంప్రదాయం కాదని మేయర్ అన్నారు. తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను మొహాలే సమర్థించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు ఇవ్వడం జాతివ్యతిరేకం, నేరం కూడా అని ఆయన హెచ్చరించారు.