జాతీయ వార్తలు

వేసవి సెలవుల్లో 5300 కేసుల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మే 11 నుంచి ప్రారంభమయ్యే వేసవి సెలవుల్లో మొత్తం 5300 కేసులు విచారించటానికి సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జాబితా విడుదలయింది. జూలై రెండు వరకూ వేసవి సెలవులు కొనసాగుతాయి. ఈ మధ్య కాలంలో మొత్తం 5300 కేసులను రెండు ప్రత్యేక వెకేషన్ బెంచ్‌లు విచారిస్తాయి. ఈ జాబితాలో ట్రిపుల్ తలాఖ్, వాట్సాప్ వినియోగదారుల సమాచార రక్షణ, అక్రమ వలసలు, పౌరసత్వ చట్టంలోని 6ఏ సెక్షన్ వంటి కీలక కేసులు ఉన్నాయి. ‘‘ఒక కేసు విచారణలో హాజరయ్యే ఎవరైనా లాయర్ రెగ్యులర్ విచారణ విషయాల్లో పేర్కొన్న అంశాలను విచారణకు వద్దనుకున్నా, లేక ఈ జాబితాలో లేని అంశాలను చేర్చాలనుకున్నా ఏప్రిల్ 28లోగా కోర్టు రిజిస్ట్రార్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది’’ అని నోటీసులో పేర్కొన్నారు.