జాతీయ వార్తలు

రభస సృష్టిస్తున్న స్వామి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బిజెపి సభ్యు డు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మూ లంగా గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో పెద్దఎత్తున గొడవ జరిగి, సభాకాలం అరగంట వృధా అయింది. కాంగ్రెస్ సభ్యులకు భారత రాజ్యాం గం కంటే ఇటలీ రాజ్యాంగం గురించి బాగా తెలుసంటూ స్వామి చేసిన వ్యాఖ్య రాజ్యసభలో గందరగోళం సృష్టించింది. స్వామి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని డిప్యూటీ చైర్మన్ పి. జె.కురియన్ ఆయనను మందలించారు. స్వామి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆయనపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. సుబ్రమణ్య స్వామి కేవలం రెండు రోజుల క్రితమే సభ్యుడయ్యాడు, ఈ రెండు రోజుల్లో స్వామి వ్యాఖ్యలను మూడుసార్లు రికార్డుల నుండి తొలగించవలసి వచ్చింది, రెండు రోజులు నుండి సభ గందరగోళంలో పడిపోయింది, ఇక సంవత్సరం పొడుగునా ఏమవుతుందో ఊహించుకోవచ్చని ఆజాద్ హెచ్చరించారు. బిజెపి రాజ్యసభకు స్వామి రూపంలో మంచి బహుమానం ఇచ్చిందని ఆజాద్ ఎద్దేవా చేశారు. రాజ్యసభ గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగానే సుబ్రమణ్య స్వామి లేచి నిలబడి తానిచ్చిన నోటీసు ఏమైందంటూ ప్రశ్నించారు. స్వామి అగస్టా వెస్ట్‌లాండ్ వివాదాన్ని ప్రస్తావిస్తున్నారని భావించిన కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలో నిలబడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పి.జె.కురియన్ ఆయనకు మాట్లాడే అనుమతి ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడొకరు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతూ సుబ్రమణ్య స్వామి పేరు ప్రస్తావించారు. దీనితో స్వామి లేచి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ సభ్యులు దీనిని ప్రతిఘటించటంతో స్వామి వారిని విమర్శిస్తూ ‘మీకు భారత రాజ్యాంగం కంటే ఇటలీ రాజ్యాంగం బాగా తెలుసు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి మండిపడిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి స్వామికి, ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఎం.ఏ. ఖాన్, వి.హనుమంత రావు, జె.డి. శీలంతోపాటు దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి స్వామి వ్యాఖ్యలను ఖండించారు. స్వామి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించినా కాంగ్రెస్ సభ్యులు మాత్రం శాంతించకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. స్వామి తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నఖ్వి విజ్ఞప్తి చేసినా కురియన్ పట్టించుకోలేదు. స్వామి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్లనే సభల గందరగోళం నెలకొంటోందని కురియన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు శాంతించిన అనంతరం జీరో అవర్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.