జాతీయ వార్తలు

ఎట్టకేలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: గత రెండేళ్లుగా ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్న 32మంది తెలుగువాళ్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్ర, రాష్ట్రాల తీవ్ర కృషితో ఎట్టకేలకు బాధితులు సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. బాధితుల్లో తెలంగాణవాసులే 31మంది ఉన్నారు. ఇరాక్ నుంచి ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాధితులను ఏపీ-తెలంగాణ భవన్‌కు తరలించారు. బాధితులు అందరినీ స్వస్థలాలకు పంపించేందుకు తెలంగాణ అధికారులు ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో 18మందిని తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో, రాత్రి 10.30కు మరో 13మందికి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల్లో ఎక్కువగా తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. దీనిపై తెలంగాణ గల్ఫ్ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ దృష్టికి కొద్దికాలం క్రితమే సమస్యను తీసుకెళ్లామన్నారు. గత మూడు మాసాలనుంచి చేసిన కృషితో బాధితులను స్వస్థలాలకు తీసుకురాగలిగామని అన్నారు. ఈ ప్రక్రియలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపామన్నారు. ఢిల్లీకి చేరుకున్న బాధితులు మాట్లాడుతూ రెండేళ్ల నరకయాతన అనంతరం ఢిల్లీకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇరాక్‌లోని ఎల్బెడ్‌తో పాటు పరిసర పట్టణాల్లోని కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ గల్ఫ్ ఏజెంట్లు నమ్మిచడం వల్లే అక్కడకు వెళ్లామన్నారు.

చిత్రం..బాధితులతో మాట్లాడుతున్న తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్