జాతీయ వార్తలు

ఎన్డీఏ మూడేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు విడుదల చేయాలని భావిస్తోంది. వివిధ ప్రభుత్వ విధానాలపై రాజకీయ ఆరోపణలకు దీటుగా జవాబు చెప్పేందుకు తాము సాధించిన విజయాలపై జాతికి నివేదిక సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెలలో మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలు, వాస్తవ గణాంకాలు, సమాచారంతో రిపోర్టు విడుదల అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డును ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్లేందుకు, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారం, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా చేపడుతున్న చర్యలకు గట్టి సమాధానం చెప్పేందుకు నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది.