జాతీయ వార్తలు

మధుకర్ మృతిపై విద్యార్థి సంఘాల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: మంథని మండలం ఖానాపూర్ యువకుడు మధుకర్ మృతిపై దళిత విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు ధర్నా నిర్వహించాయి. మంగళవారం జెఎన్‌యూలోని విద్యార్థి సంఘం బీర్సా అంబేద్కర్ పూలే స్టూడెంట్ అసోసియేషన్ (బాప్స) ఆధ్వర్యంలో మధుకర్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్వంలో తెలంగాణ భవన్ ముందు ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను ప్రధాన ద్యారంవద్ద అడ్డుకున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఆరు అడుగుల గోతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మధుకర్ కుటుంబానికి న్యాయం జరగేవరకు ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు. అయితే ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో బాప్స విద్యార్థి సంఘం నేతలు ప్రవీణ్, మణికంఠ, మనోహర్, వికాస్, అరుణ తదితరులు పాల్గొన్నారు.