జాతీయ వార్తలు

నియోజక వర్గాల పెంపుపై 6న కీలక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: రెండు తెలుగు రాష్ట్రాల నియోజక వర్గాల పెంపునకు సంబంధించి హోంశాఖ కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరగనుంది. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఇతర హోంశాఖ అధికారులు పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపునకు సంబంధించి రాజ్యాంగంలోని 170(3) అధికరణకు సవరణ చేయాలా లేక విభజన చట్టలో పేర్కొన్న విధంగా ముందుకు వెళ్లాలా అన్న దానిపై కేంద్రం ఒక స్పష్టతకు రానుంది. దీనిపై ఇప్పటికే కేంద్రం కసరత్తు చేస్తున్నందున హోంశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఈ పార్లమెంట్ సమావేశాలలోని దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసన సభల సీట్లను వీలున్నంత త్వరగా పెంచాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కలిసి సుజనా చౌదరి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ఫీజులేకుండా కేజ్రీ తరపున వాదిస్తా: జత్మలానీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తనకు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున తాను ఫీజు లేకుండానే వాదిస్తానని ప్రముఖ న్యాయవాది రామ్‌జత్మలానీ స్పష్టం చేశారు. ఎక్కడ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతోనే తన బిల్లులపై ఉద్దేశపూర్వకంగానే వివాదం సృష్టించారంటూ అరుణ్ జైట్లీపై కూడా ఆయన విరుచుకు పడ్డారు. 2జి కుంభకోణంలో తమ తరపున వాదించేందుకు ఓ ప్రైవేటు సంస్థ జైట్లీకి భారీ మొత్తంలో ఫీజులు చెల్లించిందని ఢిల్లీలోని అధికార ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తరపున వాదించే లాయర్‌కు ఆ ప్రభుత్వమే ఫీజు చెల్లించడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఆప్ పార్టీ, కేజ్రీవాల్ భారీ మొత్తంలో ఫీజులను ఓ పెద్ద లాయర్‌కు చెల్లించే పరిస్థితి ఉండదని తెలిపింది. తాను ఫీజు లేకుండానే వాదిస్తానని చెప్పినా కేజ్రీవాలే ‘నేను చెల్లిస్తాను. బిల్లులు పంపండి అన్నారు. అందుకే ఫీజు బిల్లులు పంపాను’అని జత్మలానీ అన్నారు. అరుణ్ జైట్లీతో పోలిస్తే కేజ్రీవాల్ నిజాయితీ కలిగిన నాయకుడని తెలిపారు.