జాతీయ వార్తలు

చిన్న రైతుకు వరాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 4: ఉత్తరప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల తరువాత మంగళవారం ఇక్కడ తొలిసారి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు. దీని వల్ల రాష్ట్రంలో 2.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. మీడియా కథనాల ప్రకారం రైతుల రుణమాఫీ కోసం 36వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అలాగే కబేళాల నిషేధం, యాంటీ రోమియో స్క్వాడ్ నియామకాలకు కేబినెట్ ఆమోదం ముద్రవేసింది. రైతుల నుంచి వంద శాతం గోధుమలు కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధికి తక్షణం 47 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సిఎం ఆదిత్యనాథ్ ఆదివారం ప్రకటించారు. తొలి కేబినెట్ భేటీ సందర్భంగా లక్నో లో కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మతో సిఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో రైతుల రుణమాఫీ సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేస్తామని బిజెపి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.