జాతీయ వార్తలు

చైనా హెచ్చరిక బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బౌద్ధ మత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించటాన్ని నిలిపివేయాలంటూ చైనా చేసిన హెచ్చరికను భారతదేశం తుంగలో తొక్కింది. అనుకున్న ప్రకారం టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం అరుణాచల్‌లో అడుగు పెట్టడంతో చైనా హెచ్చరిక నీరుగారినట్టయింది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు పర్యటించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతి మంజూరు చేసినట్లు తెలిసింది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తే భారత, చైనా సంబంధాలు మరింత దెబ్బతింటాయని, ఇందుకు భారతదేశమే బాధ్యత వహించవలసి ఉంటుందని చైనా హెచ్చరించడంతో పరిస్థితి వేడెక్కింది. దీనితో దలైలామా పర్యటన వ్యవహారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలనకు వెళ్లింది. నరేంద్ర మోదీ అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం దలైలామా పర్యటనకు అనుమతి మంజూరు చేశారు. భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం చైనాకు మంచిది కాదని
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రెజీజు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ టిబెట్ బౌద్ద గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వెళ్లటం పట్ల చైనా అభ్యంతరం పెట్టటం భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని చెప్పారు. మాది ప్రజాస్వామ్య, లౌకిక దేశం, అందుకే మత గురువులు దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చు, వారిని నిలువరించే అధికారం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. దలైలామా ఈరోజు వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లవలసింది. అయితే వాతావరణం బాగుండకపోవటంతో దలైలామా ప్రయాణం చేయవలసిన హెలికాప్టర్ గోహౌతీ నుండి బయలుదేరలేకపోయింది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించటం తమకు సమ్మతం కాదని చైనా గత వారం హెచ్చరించటం తెలిసిందే. దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా, భారత సంబంధాలు దెబ్బతింటాయి, దీనికి భారత దేశమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. అయితే భారతదేశం మాత్రం ఇదేదీ కుదరదని స్పష్టం చేసింది. బౌద్ద మత గరువైనా దలైలామా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చునని స్పష్టం చేసింది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల చైనాతోపాటు మరికొందరు అభ్యంతరం తెలపటం గురించి ప్రస్తావిస్తూ ఇది భారత దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని కిరెన్ రెజీజూ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తమ పొరుగుదేశమైన చైనాతో సత్సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, పొరుగు దేశాలతో గొడవ పడటం తమకు ఎంత మాత్రం ఇష్టం లేదని రెజీజూ చెప్పారు. భారత దేశం ఎప్పుడు కూడా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, ఇదే విధంగా చైనా కూడా భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని రెజీజూ స్పష్టం చేశారు. భారతదేశం ఎప్పుడు కూడా చైనా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించలేదు, ఒక చైనా విధానాన్ని సమర్థించాం, కాబట్టి చైనా కూడా భారతదేశం సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కిరెన్ రెజీజు స్పష్టం చేశారు. దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనతో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఆయన చెప్పారు. అరుణాచల్ చేరుకున్న దలైలామాకు ఘనస్వాగతం పలికారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన రోడ్డు మార్గంలోనే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండూ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు.

చిత్రం..అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బామ్డిలాకు చేరుకున్న టిబెట్ గురువు దలైలామా