జాతీయ వార్తలు

రాష్ట్రాలకు రాజకీయాలే ముఖ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: జాతీయ రహదారులు, స్టేట్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం నిర్ద్యంద్వంగా సమర్థిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరిన, కోరని రాష్ట్రాలు మాత్రం రాజకీయాలవారీగా విడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. 2016 డిసెంబర్ 15న ఇచ్చిన తీర్పును సవరించాలని బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలు తమను ఆశ్రయించినట్లు గతవారం ఈ పిటిషన్లపై తీర్పు చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పును సవరించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం, తెలంగాణ, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. కాగా, 18 రాష్ట్రాలు తీర్పును సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నాయి.
2016 డిసెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీనియర్ అడ్వకేట్లు అజిత్ కుమార్ సిన్హా, ఎకె పాండాల ద్వారా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయగా, తమిళనాడు ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మాత్రం తీర్పును తప్పుబట్టడం గమనార్హం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 142 అధికరణం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన అధికార పరిమితులను కుదించివేస్తోందని రోహత్గి వాదించారు. అయితే తీర్పును సవరించాలని కోరుతూ రోహత్గి చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించలేదు. జాతీయ రహదారులు, స్టేట్ హైవేలను పోల్చి చూడడంలోను, అటార్నీ జనరల్ వాదనలోనే తప్పు ఉందని, తమ తీర్పులో కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఒకవేళ జాతీయ రహదారు, స్టేట్ హైవేలు రెండింటింకీ మద్య నిషేధాన్ని అమలు చేయాల్సి వచ్చినా రాష్ట్ర హైవేలు వెళ్లే మున్సిపల్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు మినహాయింపు ఇవ్వాలని వాదిస్తున్నారని, మొత్తంమీద ఏదో విధంగా కాస్త వెసులుబాటు కల్పించాలన్నదే ఆయన వాదన ఉద్దేశంగా కనిపిస్తోందని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎల్‌ఎన్ రావులతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు మద్యం వ్యాపారం సాగించడం వ్యక్తి ప్రాథమిక హక్కు కాదని కూడా బెంచ్ స్పష్టం చేసింది.