జాతీయ వార్తలు

అవినీతిపరులెవరినీ వదలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వివిఐపి హె లికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమైన అంశం అవినీతేనని పేర్కొంటూ ఇందులో అవినీతికి, అక్రమాలకు పాల్పడిన వారినెవరినీ వదలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు నిలబెడతామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్‌ను యుపిఏ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిందని కాంగ్రెస్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక 2014 జూలై 3న ఈ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడంతో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఆరు కంపనీలపై కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అన్ని కోణాల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని, ఈ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన కార్లో గెరోసా, గుయిడో హాస్చ్‌కే రాల్ఫ్, క్రిస్టియన్ మిచెల్ జేమ్స్‌లను అరెస్టు చేసి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ కుంభకోణంలో వాస్తవాలన్నింటినీ బయటపెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదని పేర్కొంది. ఈ ఒప్పందంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిలో కొంత మంది దేశం బయట ఉన్నారని, అందువల్ల కేసు దర్యాప్తుకు చాలా సమయం పడుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది. 12 హెలికాప్టర్లను సరఫరా చేయడానికి అగస్టా వెస్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎడబ్ల్యుఐఎల్)తో 2010 ఫిబ్రవరి 10న కుదిరిన ఒప్పందాన్ని 2014 జనవరి ఒకటిన రద్దు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రీ-కాంట్రాక్ట్ ఇంటెగ్రిటీ పాక్ట్‌లోని నిబంధనలను అగస్టా వెస్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉల్లంఘించిందనే ప్రధాన కారణంతో ఒప్పందాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసినట్లు వివరించింది. అయితే ఆ ఆదేశాలలో ఆ కంపనీని నిషేధించలేదని పేర్కొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2014 జూలై 3న జారీ చేసిన ఆదేశాలలో హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడంతో పాటు కుంభకోణంతో సంబంధం ఉన్న ఆరు కంపనీలపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అప్పటి నుంచి ఈ ఆరు కంపనీల నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కొనుగోళ్లు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.