జాతీయ వార్తలు

మూడేళ్లలో ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రధానమైన సంస్కరణలు, జరిగిన ప్రగతిని ప్రతిబింబింపజేసే సమగ్రమైన డేటాతో పాటుగా, తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించిన అయిదు ప్రధానమైన విజయాలను తెలియజేయాలని ప్రభుత్వం కేంద్రమంత్రులందరినీ ఆదేశించింది. వీటికి సంబంధించిన గణాంకాలను, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ వల్ల కలిగిన ప్రయోజనాలు అయిదింటిని తెలియ జేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రులందరికీ గత వారం పంపిన లేఖలో కోరారు. ఈ లేఖ కాపీ పిటిఐ చేతికి వచ్చింది. మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజయిన మే 26కు ముందే వీటిని ప్రచురించాలని భావిస్తున్నందున నివేదికను ఒక బుక్‌లెట్ రూపంలో పంపించాలని వెంకయ్యనాయుడు ఆ లేఖలో కోరారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన లేదా ప్రజలు ప్రశంసిస్తున్న సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన అయిదు ప్రధాన అంశాలు-ఉదాహరణకు 2014లో ఎన్ని వంటగ్యాస్ కనెక్షన్లు ఉండినాయి, 2017లో ఇప్పుడు వాటి సంఖ్య ఎంత? సంబంధిత మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన మూడు సంస్కరణలు, ఒక్కోటి ఒక పేరాగ్రాఫ్‌ల్లో మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ముఖ్యమైన విజయగాథలను పంపించాలని వెంకయ్యనాయుడు ఆ లేఖలో కోరారు. కాగా, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సానుకూల మార్పుల గురించి ప్రజలకు తెలియజేయాలని ఈ నెల 21న రాసిన మరో లేఖలో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రులు, బిజెపి సీనియర్ నేతలను కోరారు. అంతేకాదు, దేశ ప్రజల మూడ్ బిజెపికి, ప్రధాని మోదీకి అనుకూలంగా ఉందని కూడా ఆ లేఖలో వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మోడీ టీమ్‌లో సభ్యులుగా ఉన్నందుకు మనమంతా గర్వించాలని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కోట్లాది మంది ప్రజల భవిష్యత్తులను మార్చేందుకు నిర్విరామంగా ప్రభుత్వం చేసిన కృషి ఇప్పుడు ఫలితాలనిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయడం కోసం మనమంతా కూడా వాస్తవాలు, అంకెలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కూడా వెంకయ్యనాయుడు ఆ లేఖలో సూచించారు. తమకు అప్పగించిన నిర్దిష్ట రంగాల అంశాలపై ఒక నోట్‌ను తయారు చేసే మంత్రుల జాబితాను కూడా ప్రభుత్వం సిద్దం చేసినట్లు ఆ లేఖలో తెలియజేశారు. ఉదాహరణకు ప్రధానమంత్రి జరిపిన విదేశీ పర్యటనలు, ఆ పర్యటనల వల్ల లభించిన ప్రధాన ఫలితాలు, విదేశాలనుంచి పెరిగిన పెట్టుబడుల ప్రవాహంలాంటి వాటిపై తెలియజేస్తూ ఒక నోట్‌ను తయారు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌ను కోరారు.