జాతీయ వార్తలు

ముగడ గ్రామానికి జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9:ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ విభాగంలో 12 అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పని తీరును కనబరిచిన స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది ఇచ్చే పంచాయతీ అవార్డులను 2017 సంవత్సరానికి ఆదివారం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన జిల్లా పరిషత్‌లు, మండలాలకు,గ్రామ పంచాయితీలకు కేంద్రం నగదు పారి తోషికాన్ని అందజేయనుంది. పంచాయతీల అభివృద్ధి, నిధులు సద్వినియోగం, పారిశుద్ధ్యం, వౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి నిధులు అనుసంధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ అవార్డులకు ఎంపిక చేసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ పంచాయతీ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్-2017ను దక్కించుకుంది. అలాగే పంచాయత్ సశక్తీకరణ పురస్కార్ విభాగంలో ఏపీకి 11 అవార్డులు లభించాయి. జిల్లా పంచాయతీ విభాగంలో అనంతపురం జిల్లా పరిషత్‌ను అవార్డు వరించింది. పంచాయత్ సశక్తీకరణ పురస్కారాలు మండల స్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి, చిత్తూరు జిల్లా చిత్తూరు మండలానికి, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి దక్కాయి. సశక్తీకరణ్ పురస్కార్‌లు పంచాయతీ స్థాయిలో చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎల్‌కెపి వందలపూర్, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు, నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినమీరం, విశాఖ జిల్లా అరకు మండలం పెద లబుడు పంచాయతీలకు లభించాయి. ఈ అవార్డులను 24న లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా అందుకోనున్నారు.