జాతీయ వార్తలు

బాబోయ్ స్కూలు ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ ఈ ఏడాది ఫీజులు భారీగా పెరిగిపోయాని తాజాగా జరిగిన ఓ జాతీయ సర్వే స్పష్టం చేస్తోంది. 11 నుంచి 20శాతం వరకూ పెరిగిన ఫీజుల భారంతో తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారని, కొన్ని రాష్ట్రాల్లో అయితే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు కూడా దిగారని లోకల్ సర్కిల్స్ అనే సామాజిక సంస్థ తెలిపింది. గత విద్యా సంవత్సరం కంటే కూడా ఈ సారి పెరిగిన ఫీజులు భరించలేనంతగా ఉన్నాయని,ఇంత భారీగా వీటిని ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న దానిపై ఆయా పాఠశాలల యాజమాన్యాలూ కూడా సరైన వివరణ ఇచ్చుకోలేకపోతున్నాయని వెల్లడించింది. పిల్ల ల తల్లిదండ్రుల సగటు ఆదాయాన్ని మించిన స్థాయిలో గత మూడేళ్లుగా స్కూలు ఫీజులు పెరిగిపోతూ వచ్చాయని, ఈసారి కొన్ని స్కూళ్లు తమ ఫీజులను ఏకంగా 20శాతం వరకూ పెంచేశాయన్న ఆందోళన వ్యక్తమైంది. సర్వేలో పాల్గొన్న 9వేల మందిలో దాదాపు అరవై శాతం మంది తల్లిదండ్రులు పెరిగిన స్కూలు ఫీజులు భరించలేని స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో 75శాతం మంది ఫీజుల మోత ఈసారి 10శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు. పిల్లలను చదివించడా నికి తల్లదండ్రులు తమ ఇతర ఖర్చులను సైతం తగ్గించుకొని పెరిగిన ఫీజుల భారాన్ని భరిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. కాగా పిల్లల నుంచి వసూలు చేసే ఫిజుల వివరాలను సిబిఎస్‌ఇకి అలాగే స్కూళ్ల వెబ్‌సైట్లలో ఉంచాల ని ఆదేశం కూడా ఉంది. అయతే కేవలం 14వేల స్కూళ్లు మాత్రమే దీన్ని పాటిస్తున్నాయ.