జాతీయ వార్తలు

దేహం వెలుపల గుండె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తర్‌పూర్, ఏప్రిల్ 9: మధ్యప్రదేశ్‌లోని ఖజురహో పట్టణంలో ఒక ఆడ శిశువు అత్యంత అరుదైన విధంగా జన్మించింది. ఖజురహో జిల్లా వైద్య కేంద్రంలో ఈ నెల 5వ తేదీన జన్మించిన ఈ శిశువుకు దేహం వెలుపల (్ఛతీ భాగం వెలుపల) గుండె ఉందని, దీంతో ఆ శిశువును చికిత్స నిమిత్తం న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారని ఆదివారం ఒక అధికారి వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో కేవలం ఎనిమిది మంది శిశువులు మాత్రమే ఈ విధంగా జన్మిస్తారని, వైద్య పరిభాషలో దీనిని ఎక్టోపియా కార్డిస్ అని పిలుస్తారని ఛత్తర్‌పూర్ జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్‌ఎస్.త్రిపాఠి పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.