జాతీయ వార్తలు

మానసిక రోగుల ఆత్మహత్యాయత్నాలు శిక్షార్హం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తు లు ఆత్మహత్యకు చేసే ప్రయత్నాలు ఇకమీదట శిక్షార్హం కావు. ఇందుకు సంబంధించిన కొత్త చట్టానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. మానసిక అనారోగ్యంతో బా ధపడుతున్న వ్యక్తులకు మత్తుమందు (అనస్థీసియా) లేదా కండరాలకు ఉపశమనమిచ్చే మందులు ఇవ్వకుండా ఎలక్ట్రో-కన్వల్సివ్ చికిత్స (షాక్ థెరపీ) చేయడాన్ని కూడా ఈ చట్టం నిషేధిస్తోంది. శుక్రవారం రాష్టప్రతి ఆమోదాన్ని పొందిన మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్-2017 ప్రకారం మానసిక రోగులను ఎట్టిపరిస్థితుల్లోనూ గొలుసులతో బంధించడానికి వీల్లేదు. మానసిక రోగులకు కేవలం వైద్య సేవలను అందించడమే కాకుండా వారి హక్కులను కాపాడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. మన దేశంలో ఆత్మహత్యా ప్రయత్నాన్ని నేరంగా పరిగణిస్తుండటంతో ఇటువంటి ప్రయత్నాలు చేసిన వారికి భారత నేర శిక్షా స్మృతి (ఐపిసి)లోని సెక్షన్-309 నిబంధనల ప్రకారం జరిమానాతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు మానసిక రోగులకు వర్తించబోవని, ఆత్మహత్యకు ప్రయత్నించిన మానసిక రోగులపై ఐపిసి సెక్షన్-309 నిబంధనల కింద విచారణ జరిపేందుకు గానీ, శిక్షించేందుకు గానీ వీలులేదని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.