జాతీయ వార్తలు

మనకూ సొంత నావిగేషన్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరు పేట, ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి గురువారం మధ్యాహ్నం తాజాగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి రాకెట్‌తో మనకంటూ సొంత దిక్సూచి వ్యవస్థకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఉపగ్రహ బరువు 1425కిలోలు. ఇది 12సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ సిరీష్‌లో ఇది చివరిది. ఇందులో మొత్తం 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.3,425కోట్ల వ్యయం ఖర్చుచేశారు. దీంతో రోదసీలో మన జిపిఎస్ సేవలు ఊతం పలికారు. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో ఉంటాయి. నాలుగు ఉపగ్రహాలు భూ అనువర్తిత కక్ష్యలో ఉంటాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జిను విజయవంతంగా ప్రయోగించడంతో ఏడు దిక్చూచి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లయింది. దీంతో ఈ వ్యవస్థ సేవల ప్రారంభానికి మార్గం సుగమమైంది. నిజంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు కింద 7 ఉపగ్రహాలు ఉంటాయి. సేవలు ప్రారంభించాడానికి నాలుగు ఉపగ్రహాలు సరిపోతాయి. వీటికి మరో మూడింటిని జోడించడం ద్వారా కచ్చితత్వం విశ్వసనీయత పెరుగుతాయి. భారత దేశం చుట్టూ 1500కిలో మీటర్ల దూరం వరకు ఈ ఉపగ్రహ వ్యవస్థ సేవలందిస్తుంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో ప్రయోజనాలు
ఈ వ్యవస్థ భూ, జల, వాయు మార్గాలకు స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. డ్రైవర్లకు దృశ్య, స్వర దిశా నిర్ధేశం చేస్తుంది. వాహన గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలోను, నౌకల సమూహ నిర్వహణలోను సాయపడతుంది. విపత్తుల సమయంలో సహాయ బృందాలకు సమాచారాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్‌తో అనుసంధానం అవుతుంది.
పిఎస్‌ఎల్‌వి విజయపరంపర
ఇస్రోకు ఈ ఏడాది మరో విజయంతో శుభారంభం జరిగింది. జనవరి 20న పిఎస్‌ఎల్‌వి-సి 31 విజయం చెందగా మళ్లి మార్చి 10న ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 32 మరోసారి విజయబావుట ఎగరవేసింది. ప్రస్తుతం పిఎస్‌ఎల్‌వి-సి 33 కూడా విజయఢంకా మోగించింది. మనమెప్పుడు విశ్వసించే పిఎస్‌ఎల్‌వి రాకెట్ మరోసారి నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. తొలి ప్రయోగం వైఫల్యం మినహా పిఎస్‌ఎల్‌వి విజయపరంపర షార్‌లో కొనసాగుతూనే ఉంది. తాజా ప్రయోగం పిఎస్‌ఎల్‌వి-సి 33 శ్రేణిలో 35వది కాగా ఎక్స్‌ఎల్ విభాగంలో 13వ ప్రయోగం. నావిగేషన్ సిరీష్‌లో చివరి ప్రయోగం కావడం విశేషం. ప్రయోగ సమయంలో 44.4మీటర్ల పొడవు, 320టన్నుల బరువు ఉన్న పిఎస్‌ఎల్‌వి నాలుగు దశల్లో ప్రయోగం జరిగింది. 1,3దశల్లో ఘన ఇంధనం, 2,4దశల్లో ధ్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు.