జాతీయ వార్తలు

మిర్చి రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఏపీలో మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మంగళవారం పార్లమెంట్‌లోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కార్యాలయంలో మిర్చి రైతుల సమస్యలపై మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్‌లతో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మిరప పండించిన రైతులు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని, రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతుల సమస్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత ఏడాది మిర్చికి అధిక ధర రావడంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మిర్చిని అధికంగా పండిచారని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. గురువారం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు.
శుక్ర, శనివారాలలో మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకోవాలో నిర్ణయానికి వస్తామని ఆయన వెల్లడించారు. ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మిరప పంట ఎక్కువకాలం నిల్వ ఉండనందున..దీన్ని స్టోరేజ్ చేయలేమని వెల్లడించారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మిర్చి రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.