జాతీయ వార్తలు

యూపీలో విద్యుత్ కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 11: నవరాత్రి సందర్భంగా అన్ని శక్తిపీఠాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అమలుచేసిన యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం అన్ని జిల్లా కేంద్రాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్రామాలకు 18 గంటలు విద్యుత్ సరఫరా చేస్తారు.
అలాగే వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని అన్ని తాలూకాలకు ఇరవై గంటలు విద్యుత్ సరఫరా చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పాలనాపరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా అన్ని జిల్లా కేంద్రాలకు నిరంతరాయం విద్యుత్ సరఫరా చేయడంతో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టయింది. మూడుగంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ మీడియాకు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయని ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణం తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను సిఎం ఆదేశించారు. వ్యవసాయ పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. అందరికీ విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, దీనిలో భాగంగానే పలు చర్యలు తీసుకున్నట్టు శ్రీకాంత్ శర్మ చెప్పారు. పల్లెల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సిఎం అన్నారు. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.‘ 2018 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి పేదవానికి విద్యుత్ అందించాలన్నది బిజెపి చీఫ్ అమిత్‌షా, సిఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యం’ అని మంత్రి పేర్కొన్నారు.