జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ప్రపంచ దేశాల అభివృద్ధికి ఉగ్రవాదం అవరోధంగా నిలిచిందని, దాన్ని అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేశంపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్పెషల్ ఇన్వాయిస్ ఆన్ మిడిల్-ఈస్ట్ అన్న అంశంపై బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల ప్రతినిధుల సమావేశం విశాఖలో మంగళవారం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని తీర్మానం చేసిందని చెప్పారు. ఉగ్రవాదానికి హద్దులు, ప్రాంతాలు, కుల, మతాలు లేవని అన్నారు. ఉగ్రవాదంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికతను పాలకులు కన్నా ఉగ్రవాదులే ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదుల దాడులకు ఒక్కోసారి ఒక్కో దేశం భారీగా నష్టపోవలసి వస్తోంది. ఉగ్రవాదం మన వరకూ రాలేదు కదా! అని పొరుగు దేశాలు చేతులు ముడుచుకు కూర్చోకూడదని ఆయన చెప్పారు. అన్ని దేశాలు సమైక్యంగా ఉగ్రవాదంపై పోరుసలపాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఈ సదస్సు ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలేమిటన్నదానిపై చర్చించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇక గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చంద్రబాబు చెప్పారు. 2031 నాటికి పట్టణీకరణ ఊహించని విధంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, పట్టణాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధిని, ప్రజల హ్యాపీనెస్‌ను సమతౌల్యం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం హ్యాపీనెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ఈ సమావేశంలో ఇండియా తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి అమర్ సిన్హా, రష్యా నుంచి రష్యా అధ్యక్షుడి తరపున ప్రత్యేక ప్రతినిధిగా మిఖైల్ బోగ్డానోవ్, సౌత్ ఆఫ్రికా నుంచి ఆ దేశ డిప్యూటి మినిస్టర్ నోమైందా కేటలిన్ ఫెకెటో, చైనా నుంచి గాంగ్ జిషాంగ్, బ్రెజిల్ నుంచి లిజియా మరియా స్కేరీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల ప్రతినిధులను చంద్రబాబు సత్కరించారు. అలాగే ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి ఎంపి అయ్యన్నపాత్రుడు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, అనిత, ఎమ్మెల్సీలు ఎంవిఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వరరావు, గాదె శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బ్రిక్స్ ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు