జాతీయ వార్తలు

బడ్జెట్ సమావేశాల్లో అన్నీ విజయాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: బడ్జెట్ సమావేశం అధికార పార్టీకి ఒక విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, బిజెపి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిందని, పార్లమెంటులో అనేక బిల్లులు ఆమోదం పొందేలా చూడగలిగిందని అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ఒక రోజు ముందు మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, వచ్చే నెలకు మూడేళ్లు పూర్తి చేసుకోనున్న అధికార కూటమికి అనుకూలంగా ప్రజల్లో సానుకూల భావన ఉందని, అందువల్ల సంస్కరణల, అభివృద్ధి అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని కోరారు. పేదలు, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి ఇది మనకు ఓ సువర్ణావకాశమని, మరిన్ని సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇదే సరయిన సమయమని ఆయన అన్నారు. మే 24నుంచి ప్రభుత్వ మూడవ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడానికి రూపొందించిన నెల రోజుల అజెండా గురించి కూడా సమావేశంలో పార్టీ ఎంపిలకు తెలియజేశారు.
సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాలు చాలా నిర్మాణాత్మకంగా సాగాయని, లోక్‌సభ 21, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయని మోదీ అన్నట్లు చెప్పారు. ఈ బిల్లుల్లో కీలకమైన జిఎస్‌టి బిల్లులతో పాటుగా రాజకీయంగా ముఖ్యమైన ఓబిసి బిల్లు కూడా ఉందని అన్నారు. ఈ సమావేశాల సమయంలోనే జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిందని మోదీ చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జనంలో తమ ప్రభుత్వం కల్పించిన ఆశలు ఇప్పుడు విశ్వాసంగా రూపుదిద్దుకుందని ఆయన అన్నారు.
సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా మాట్లాడి ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలియజేసినట్లు అనంతకుమార్ చెప్పారు. ప్రధాని మోదీ వెంకయ్య ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోమవారం రాత్రి జరిగిన 33 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో అకాలీదళ్‌కు చెందిన ప్రకాశ్ సింగ్ బాదల్, తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమైన మిత్రపక్షాల నేతలు ఆయన నాయకత్వం గురించి ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ రోజు రామభక్తుడయిన హనుమంతుడి జయంతి అని అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్తకు ఆయన నిలువెత్తు ఉదాహరణ అని అంటూ, ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని అన్నారు.