జాతీయ వార్తలు

వచ్చే ఏడాదినుంచి ఉర్దూలోనూ నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: వచ్చే సంవత్సరం నుంచి ఉర్దూ మాధ్యమంలో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. సుప్రీం కోర్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం 2018-19 సంవత్సరానికి ఉర్దూ మీడియాంలోనూ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎంఎం సంతానగౌడ్‌లతో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. మే 7 నుంచి జరగాల్సి ఉన్న నీట్‌ను ఉర్దూ మీడియంలోనూ నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూ మాధ్యమంలోనే నీట్ నిర్వహించుకోవచ్చన్న సుప్రీం కోర్టు ఈ ఏడాది వీలుపడదని పేర్కొంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున నీట్-2017లో ఉర్దూ వీలుపడదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అలాగే 2018-19 సంవత్సరానికి నీట్‌ను ఉర్దూ మీడియంలో నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పది భాషల్లో నీట్‌ను నిర్వహిస్తున్నారు.
హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, తెలుగు, తమిళ్, కన్నడ మీడియంలలో నిర్వహిస్తున్నట్టు ఇంతకు ముందే సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.