జాతీయ వార్తలు

సిఆర్‌పిఎఫ్ జవాన్లపై యువత దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల బందోబస్తులో పాల్గొన్న సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని కొంత మంది యువకులు కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ నెల 9న జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా భద్రతా విధుల్లో పాల్గొన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను యువకులు కొడుతున్న దృశ్యాలతో కూడిన ఒక వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో క్లిప్ ఆధారంగా సిఆర్‌పిఎఫ్ ఫిర్యాదు చేయగా, జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారని సిఆర్‌పిఎఫ్ ఇన్‌చార్జి డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా గురువారం ఢిల్లీలో ఒక వార్తాసంస్థకు తెలిపారు. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు గుర్తించారని, త్వరలోనే వారిపై చర్య తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతకుముందు సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రవిదీప్ సింగ్ సాహి శ్రీనగర్‌లో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ బయటికి వచ్చిన వీడియో నిజమైనదేనని తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. దాడి జరిగిన ప్రదేశం, దాడికి గురయిన సిఆర్‌పిఎఫ్ కంపనీని గుర్తించామని తెలిపారు. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుడ్గాం జిల్లా చదూర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని క్రాల్‌పొరా ప్రాంతంలో ఈ దాడి జరిగిందని వివరించారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించి, అధికారికంగా చదూర పోలీసు స్టేషన్‌లో అందజేశామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, లక్టాకియా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో స్పెషల్ సెక్రెటరి రీనా మిత్రా శుక్రవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో వారు కాశ్మీర్ లోయలో పరిస్థితిని అంచనా వేస్తారు.