జాతీయ వార్తలు

పేరు మార్పు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: మహిళలు పెళ్లయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత పాస్‌పోర్టుపై తమ అసలు పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాదు వారు తమ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి పేరు ఇచ్చినా పాస్‌పోర్టు లభిస్తుందని ఆయన తెలిపారు. ముంబయిలో గురువారం ఐఎంసి వాణిజ్య, పారిశ్రామిక మండలి మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పాస్‌పోర్టు నిబంధనల్లో ఒక ముఖ్యమైన మార్పు చేశాం. ఇప్పుడు మహిళలు తమ వివాహ లేదా విడాకుల సర్ట్ఫికెట్లను ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు పాస్‌పోర్టుపై తన తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఏ ఒక్కరి పేరును ఉంచాలనేది కూడా ఆమె ఇష్టమే’నని ఆయన చెప్పా రు. కాగా, మహిళా సాధికారికతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ప్రధాని ఆ దిశగా చేపట్టిన పలు చర్యలను సైతం వివరించారు. 3 లక్షల కోట్ల రూపాయల ముద్రా రుణాల్లో 70 శాతం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలన్నది వాటిలో ప్రధానమైనదని ఆయన చెప్పారు.