జాతీయ వార్తలు

ఇపిఎఫ్ బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13:దీర్ఘకాలంగా భవిష్య నిధి చందాదారులుగా కొనసాగుతున్న వారికి ఇపిఎఫ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇరవైఏళ్లకు పైగా ఇపిఎఫ్ సభ్యులుగా ఉన్నవారికి విధేయత, జీవిత కాల ప్రయోజనం కింద పదవీ విరమణ సమయంలో 50వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది. ఇరవై ఏళ్లకంటే తక్కువ కాలంపాటు చందాదారులుగా ఉన్న శాశ్వత దివ్యాంగులకు కూడా ఈ లబ్ధిని వర్తింపజేస్తారు. ఇపిఎఫ్‌ఓ కీలక నిర్ణాయక మండలి (సిబిటి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పదవీ విరమణకు ముందే చందాదారు మరణించే పక్షంలో కనీస మొత్తంగా రెండున్నర లక్షలు అందించాలని నిర్ణయించారు. దీనికి అదనంగా 50వేల రూపాయలను కూడా ఇవ్వాలని బోర్డు సంకల్పించింది. అయితే ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఈ ప్రయోజనాలు అమలులోకి వస్తాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రారంభంగా ఈ పధకాన్ని రెండేళ్ల పాటు అమలు చేస్తామని, అనంతరం సమీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఇపిఎఫ్‌ఓ నిధి 18వేల కోట్లు దాటిన దృష్ట్యా చందాదారులకు ఈ రకమైన అదనపు ప్రయోజనాల్ని చేకూర్చాలని సంకల్పించినట్టు తెలిపారు.