జాతీయ వార్తలు

దాసరి, జిందాల్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, మరో 13 మందిపై నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకుగాను అభియోగాలను నమోదు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది. నిందితులందరిపైనా ఐపిసి 120బి, 409, 420 సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(సి), 13(1)(డి) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని సిబిఐ ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ ఆదేశించారు. అయితే నిందితులపై అభియోగాలను ఆ తర్వాత అధికారికంగా నమోదు చేయడం జరుగుతుందని కోర్టు తెలిపింది. 2008లో అమర్‌కండ ముర్గదంగల్ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ స్టీల్, పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్), గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించి సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన ఈ కేసులో జిందాల్, మాజీ మంత్రి దాసరితో పాటుగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు వాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాతో పాటుగా మరో 11 మందిపై కేసు నమోదు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని, అప్రూవర్‌గా మారడానికి అనుమతించాలని కోరుతూ సురేశ్ సింఘాల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ కోర్టు సిబిఐకి, 14 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మే 11కు వాయిదా వేసింది.