జాతీయ వార్తలు

తదుపరి విజయాలపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పార్టీ సంస్థాగత ఎన్నికలు, కొత్త కార్యవర్గం ఏర్పాటు, మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ, రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలు, వచ్చే సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం శనివారం ఒడిశ్శా రాజధాని భువనేశ్వర్‌లో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే బిజెపి జాతీయ కార్యవర్గం సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్య కారణం మూలంగా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశానికి హాజరు కావటం లేదు. బి.జె.పి పాలిత పదమూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు పార్టీ జాతీయ కార్యవ్గం సమావేశానికి హాజరవుతున్నారు. గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిన మనోహర్ పారిక్కర్ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయవలసి ఉన్నది. రక్షణ శాఖను ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తున్న వారిని పార్టీకి పంపించే అవకాశాలున్నాయి. పార్టీకి చెందిన కొందరు నాయకులను మంత్రివర్గంలో చేర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ సారి మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణం 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రక్రియ కోసం అనుసరించవలసిన విధానం గురించి రేపటి నుండి రెండు రోజుల పాటు జరిగే జాతీయ కార్గవర్గం సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహంపై కూడా కొంత జరుగుతుందని అంటున్నారు. ఒడిశ్శా ఓటర్లపై ప్రభావం పడేలా చేసేందుకే బి.జె. పి అధినాయకత్వం భువనేశ్వర్‌లో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది.