జాతీయ వార్తలు

1నే నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష (నీట్) నిర్వహణపై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. నీట్ నిర్వహణను ఆలస్యం చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు మే 1వ తేదీన నీట్ తొలివిడత పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్(ఎఐపిఎంటి) పరీక్ష స్థానంలో మే 1న జరిగే నీట్ తొలి విడత పరీక్షను నిలిపివేయబోమని, పరీక్ష యథాతథంగా జరుగుతుందని న్యాయస్థానం కేంద్రానికి స్పష్టం చేసింది. జూలై 24న ఒకే దఫాలో నీట్ నిర్వహించాలని అనుకుంటున్న కేంద్రం ఈ మేరకు తీర్పును పునస్సమీక్షించాలని కోర్టును కోరింది. అయితే తాము ఆదేశాలు జారీ చేశామని, ముందు పరీక్షను యథాతథంగా జరగనివ్వండని కోర్టు పేర్కొంది. నీట్ ద్వారా ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వినడానికి ఈ రోజు తమకు బెంచ్ లేదని, బెంచ్ ఉత్తర్వులో మార్పులను కోరుతూ సంబంధిత పార్టీలు దరఖాస్తులు దాఖలు చేసిన తర్వాత రాబోయే రోజుల్లో దీన్ని విచారించడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, అంతకు ముందు కేంద్రం మే 1న నీట్ మొదటి దశ పరీక్ష నిర్వహణకు ఆమోదం తెలుపుతూ బుధవారం ఇచ్చిన తీర్పును పునస్సమీయించాలని కోర్టును కోరింది. విద్యార్థులకు తగినంత సమయం ఇవ్వడం కోసం రెండు దఫాలకు బదులుగా జూలై 24న ఒకే దఫాలో నీట్ నిర్వహణకు అనుమతించాలని అటార్నీ జనరల్ కోర్టును కోరారు.
ఆంధ్ర, తెలంగాణకూ ‘నీట్’ వర్తింపు: నడ్డా
కాగా, దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలకు వర్తింపచేస్తున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి జెపి నడ్డా పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణపై జమ్మూ,కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వడం లేదని తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల్లో టిఆర్‌ఏస్ ఎంపీ వినోద్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి నడ్డా సమాధానం ఇచ్చారు. నీట్ నిర్వహణపై సంకల్ప్ చారిటబుల్ ట్రస్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అనుమతించిందని చెప్పారు. అనంతరం ఎంపీ వినోద్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నీట్ నిర్వహణ వల్ల విద్యార్థుల కష్టనష్టాల గురించి ఆలోచిస్తున్నారని, దానికోసం సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారన్నారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు గురించి ఆలోచిస్తునట్లు మంత్రి నడ్డా చెప్పారన్నారు.