జాతీయ వార్తలు

జవాన్ల సంయమనం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 14: అల్లరి మూకలు రాళ్లదాడి చేసినా సిఆర్‌పిఎఫ్ జవాన్లు సహనం, సంయమనం పాటించారని, ఒక వేళ్ల కాల్పులు జరిపివుంటే ఎంతో మంది యువకులు చనిపోయి ఉండేవారని జమ్మూకాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఎస్‌పి వైద్ స్పష్టం చేశారు. యువకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నా జవాన్లు సంయమనం కోల్పోలేదని శుక్రవారం ఆయన ప్రశంసించారు. ఎన్నికల విధులు ముగించుకుని వస్తున్న జవాన్లపై యువకుల రాళ్లదాడి చేస్తున్నప్పటికి వీడియో వైరల్ అయింది. కొంత మంది యువకులు జవాన్‌పై అదేపనిగా కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి. తమై దాడి చేస్తున్నా సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఎక్కడా సహనం కోల్పోలేదని డిజిపి అన్నారు. ఏప్రిల్ 9న శ్రీనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఛదూరా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన యువకులను గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు డిజిపి వెల్లడించారు. దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు.‘రాళ్లదాడి, భౌతిక దాడులకు పాల్పడినా సిబ్బంది ఎక్కడా సంయమనం కోల్పోలేదు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు కాల్పులకు దిగితే అనేక మంది చనిపోయి ఉండేవారు’అని ఆయన పేర్కొన్నారు.