జాతీయ వార్తలు

రూ.1590ల చెల్లింపునకు కోటి నగదు బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఏప్రిల్ 14: నగదు రహిత లావాదేవీలను ప్రోత్ససించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన కింద నగదు అవార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాగపూర్‌లో నిర్వహించిన మెగా డ్రా లో విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు. లక్కీ గ్రాహక్ యోజన కింద కోటి రూపాయల నగదు ప్రథమ బహుమతిని లాతూర్‌కు చెం దిన ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని శ్రద్ధా మెంగషెట్టె అందుకున్నారు. తన కొత్త మొబైల్ ఫోన్ కోసం రుపే కార్డుతో ఆన్‌లైన్ ద్వారా రూ. 1590 ఇఎంఐని చెల్లించినందుకు ఆమెకు ఈ బహుమతి లభించింది. ఈ పథకం కింద రూ 50 లక్షల రెండో బహుమతిని గుజరాత్‌లోని కంభట్ (కాంబే)కు చెందిన హార్దిక్ కుమార్‌కు లభించింది. ప్రైమరీ స్కూల్ టీచర్ అయిన 29 ఏళ్ల హార్దిక్ కుమార్ రూ. 1,100 లావాదేవీని జరిపేందుకు తన రూపే కార్డును ఉపయోగించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన షేర్‌పూర్ గ్రామానికి చెందిన భరత్ సింగ్ రూపే కార్డు ద్వారా కేవలం వంద రూపాయల లావాదేవీ జరిపినందుకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. కాగా, వ్యాపారులకోసం ఉద్దేశించిన డిజిధన్ వ్యాపార్ యోజన కింద రూ. 50 లక్షల ప్రథమ బహుమతిని చెన్నై తాంబరంలో జిఆర్‌టి జ్యుయలర్స్‌లో రూ.300ల పేమెంట్‌ను అంగీకరించింనందుకు ఆనంద్ అనంత్‌పద్మనాభన్‌కు దక్కిం ది. మహారాష్టల్రోని థానేలో ఓ చిన్నపాటి బ్యూటీపార్లర్ యజమానురాలయిన రాగిణి రాజేంద్ర ఉత్తేకార్ రూ. 510ల ఆన్‌లైన్ చెల్లింపును తీసుకున్నందుకు రూ. 25 లక్షల రెండో బహుమతిని గెలుచుకున్నారు. కాగా, హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో హోల్‌సేల్ బట్టల దుకాణం యజమాని షేక్ రఫీ తన పిఓఎస్ మిషన్ ద్వారా 2 వేల రూపాయల పేమెంట్‌ను తీసుకున్నందుకు 12 లక్షల రూపాయల మూడో బహుమతిని గెలుచుకున్నారు. ఈ రెండు పథకాల కింద 16 లక్షల మంది మొత్తం 258 కోట్ల నగదు బహుమతులను అందుకున్నారు.