జాతీయ వార్తలు

రాష్టప్రతి ప్రభృతుల ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్టప్రతి, ప్రధాని ప్రభృతులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్లమెంటు భవనం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సుమిత్రా మహాజన్, బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, పలువురు కేంద్రమంత్రులు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో అంబేద్కర్ చిత్రపటాన్ని 1990 ఏప్రిల్ 2న అప్పటి ప్రధాని విపి సింగ్ ఆవిష్కరించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ దళిత నాయకుడు అంబేద్కర్‌కు నివాళి అర్పించారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారత దేశపు గొప్ప నాయకుల్లో ఒకరని, ఆయన జీవితం కలసి జీవించాలనుకునే భారతీయులందరికీ ఒక మార్గదర్శి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిజేస్తూ, బాబా సాహెబ్ నిజంగా ఆధునిక భారత దేశపు గొప్ప నాయకుల్లో ఒకరని, భారత్‌ను ఒక దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎప్పటికీ మరువలేమని అన్నారు. మన రాజ్యాంగ చట్టాలు, విలువల నీడలో అందరూ కలిసిమెలిసి, సంఘటితంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ అంబేద్కర్ జీవితం ఒక మార్గదర్శకమని, సమాజంలోని అన్ని వర్గాలు సమన్వయంతో కలిసి మెలిసి జీవించాలనే అంబేద్కర్ ఊహలకు భారత రాజ్యాంగమే ఒక నిదర్శనమని ఆమె అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

చిత్రం..అంబేద్కర్ 26వ జయంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ హౌజ్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆయన విగ్రహం ముందు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు