జాతీయ వార్తలు

హోదా అక్కర్లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా, హార్థికంగా కేంద్రం ఆదుకుంటున్నందున ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయి చౌదరి తేల్చి చెప్పారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన అనంతరం, మంత్రి హరీభాయి పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ ఎన్డీయే ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తోంది. ఏపీకి ఆర్థిక సాయంతోపాటు, జాతీయస్థాయి విద్యా విజ్ఞాన సంస్థలు పదింటిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు అని చౌదరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏంకావాలనేది విభజన చట్టంలో పొందుపర్చారు. చట్టంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్నందున ప్రత్యేక హోదా అవసరం లేదని హరిభాయి చౌదరి తెగేసి చెప్పారు. అంతకుముందు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తుంటే, కాంగ్రెస్ మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తామని తెలుగు రాష్ట్రాలకు మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రలో ఇంతవరకు పది జాతీయ విద్యా విజ్ఞాన సంస్థలు ఏర్పాటు చేయటంతో దాదాపు 90 వేల కోట్ల ఆర్థిక సాయం చేశామంటూ హరీభాయి చౌదరి లెక్కలు చెప్పారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చకు చౌదరి బదులిచ్చారు. విభజన చట్టం హామీల అమలును సమీక్షించేందుకు నీతి ఆయోగ్ మే4న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి గత రెండేళ్లలో 2.5వేల కోట్లు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు 850 కోట్లు ఇచ్చాం. రానున్న రెండేళ్లలో 7.1 వేల కోట్లు ఇవ్వనున్నట్టు చౌదరి ప్రకటించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు నివేదిక, అమరావతికి 180 కిలోమీటర్ల రింగురోడ్డు డిపిఆర్ సిద్ధమైందన్నారు. కొత్త రాజధానిలో హైకోర్టు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయన్నారు. తిరుపతి, కర్నూలులో ఐఐటి, తిరుపతిలో ఐఐఎస్‌ఇఆర్, విశాఖలో ఐఐఎం, ఐఐపి, గోదావరి జిల్లాల్లో ఎన్‌ఐటి, అనంతపురంలో సెంట్రల్ వర్శిటీ ఏర్పాటుకు స్థలం ఎంపిక జరిగింది. గుంటూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు స్థలం ఎంపిక, ఒప్పందం జరిగిందని మంత్రి తెలిపారు. గిరిజన వర్శిటీ ఏర్పాటుకూ విజయనగంలో స్థలం ఎంపిక జరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ విపత్కర నిర్వహణ సంస్థ ప్రారంభించామని చెబుతూ, ఒకేసారి నిధులు కేటాయించినంత మాత్రాన పనులు జరిగిపోవన్నారు. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల అభివృద్ధికి 750 కోట్లు రెండేళ్లలో ఇచ్చామన్నారు. వనరుల లోటు భర్తీకి రెండేళ్లలో 1350 కోట్లు విడుదలు చేశామన్నారు. పన్నుల కేటాయింపు కింద గత రెండేళ్లలో 34 వేల కోట్లు ఆంధ్రకు ముట్టాయని చౌదరి వెల్లడించారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 1100 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రణాళికకు 33 వేల కోట్లు కేంద్రం సాయంగా జరిగిందన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మొదటి ఏడాది 15శాతం తరుగు రాయితీ, 15 శాతం అదనపు పెట్టుబడి రాయితీ కల్పించామన్నారు.
ఖమ్మంలో విద్యుత్కేంద్రం ఏర్పాటుకు ఒడిశా నుంచి బొగ్గు లింకేజీ పూర్తి చేశామన్నారు. దుగ్గరాజపట్నంలో ఓడరేవు ఏర్పాటు పరిశీలనలో ఉందని, డిపిఆర్‌లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కొత్త ఢిల్లీ-విశాఖపట్నం ఏసీ రైలు ప్రారంభించామన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి కొత్త రైలు ట్రాక్‌ను 2400 కోట్లతో చేపడుతున్నామని, విశాఖ మెట్రో రైలు ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. రెండు రాష్ట్రాలకు నాలుగు చొప్పున అదనపు పోలీసు బెటాలియన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఎన్నో హామీలను పూర్తి చేసినా ఏమీ చేయడం లేదనడం మంచిది కాదన్నారు. మంత్రి వివరణాత్మక సమాధానం ఇచ్చినందున ప్రయివేట్ మెంబర్ బిల్లు ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నఖ్వి, సభ్యుడు రామచందర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇంతలో తెదేపా సభ్యుడు సిఎం రమేష్ లేచి సభలో కోరం లేదని చెప్పారు. కోరం గంట మోగినా సభ్యులెవరూ రాకపోవటంతో సభ సోమవారానికి వాయిదా పడింది.