జాతీయ వార్తలు

మరింత వేడెక్కనున్న ఉత్తరాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: వేసవి తాపంతో అల్లాడుతున్న ఉత్తర భారతావని మరింత వేడెక్కనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. అలాగే బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తోపాటు రాజస్థాన్ పశ్చిమ ప్రాంతంపై వ్యతిరేక తుపాను (యాంటీ సైక్లోన్) ఆవరించి ఉందని, ఉత్తర భారతదేశం అంతటా దీని ప్రభావం ఉంటుందని, ప్రత్యేకించి మధ్యప్రదేశ్ పశ్చిమ, తూర్పు ప్రాంతాలతోపాటు రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్, విదర్భ, పంజాబ్, హర్యానా, దక్షిణ ఉత్తరప్రదేశ్, సెంట్రల్ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన మారుత తుపాను కారణంగా రాగల 24 గంటల్లో అండమాన్ దీవుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అలాగే అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో ఈదురు గాలులతో పాటు చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసింది.

చిత్రం..దేశవ్యాప్తంగా ఉషోణ్రగతలు పెరిగిపోవడంతో మనుషులతోపాటు పక్షులు, జంతువులు సైతం దాహార్తితో అలమటిస్తున్నాయ. జమ్మూలో ఆదివారం దప్పిక తీర్చుకునేందుకు తంటాలు పడుతున్న ఓ వానరం