జాతీయ వార్తలు

బెంగాల్‌లో నేడు ఐదో దశ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమబెంగాల్‌లో శనివారం అయి దో దశ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ జరుగనున్న 53 నియోజకవర్గాలలో సుమారు 90వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించనున్నారు. నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలు తలెత్తకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించేందుకు విస్తృత స్థాయి లో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. పోలీసులు, కేంద్ర బలగాలు.. వాహనాలను తనిఖీ చేయడానికి వివిధ చోట్ల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 800 గ్రామాలను అతి సున్నితమైనవిగా, 1,467 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించినట్లు కోల్‌కతాలోని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ‘శనివారం పోలింగ్‌ను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. తిల్‌జాలా, కస్బా, చేట్లా, గార్డెన్ రీచ్, పోర్ట్ ప్రాంతాలతో పాటు కోల్‌కతాలోని బెహాలా, ఠాకూర్‌పకుర్, జాదవ్‌పూర్‌లకు చెందిన 15 నుంచి 20 మంది కరడుగట్టిన నేరస్థులను ఇదివరకే అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించడంతో పాటు అన్ని నియోజకవర్గాలలో పోలింగ్ రోజున సిఆర్‌పిసిలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, మనీశ్ గుప్తా, పార్థా ఛటర్జీ, జావేద్ అహ్మద్ ఖాన్ వంటి కీలక మంత్రులు, నగర మేయర్ సోవన్ ఛటర్జీ శనివారం నాటి పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, సోవన్ ఛటర్జీ నారద స్టింగ్ ఆపరేషన్ వీడియోలలో కనిపించిన విషయం తెలిసిందే. 43 మంది మహిళలు సహా మొత్తం 349 మంది అభ్యర్థులు శనివారం పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు. 14,500 పోలింగ్ కేంద్రాలలో 1.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి దీపా దాస్‌మున్షీని ఢీకొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచే నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మనుమడు చంద్ర కుమార్ బోస్ పోటీ చేస్తున్నారు.