జాతీయ వార్తలు

మళ్లీ పార్లమెంటు కమిటీ ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై మరోసారి మే 25న తన ముందు హాజరుకావాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్థారుూ సంఘం ఆదేశించింది. ఉర్జిత్ పటేల్‌ను మరోసారి పిలిపించాలని కమిటీలోని బిజెపి ఎంపీలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒత్తిడి తేవడంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో పార్లమెంటు కమిటీ ముందు ఉర్జిత్ పటేల్ హాజరయినప్పుడు కమిటీ సభ్యులు ఆయనను ప్రశ్నించడానికి యత్నించగా, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ కూడా అయిన మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని ఆర్‌బిఐని ఒక వ్యవస్థగా గౌరవించాల్సిన అవసరం ఉందని, పటేల్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయవద్దని చెప్పడంతో కమిటీ సభ్యులు ఆయనను ప్రశ్నించకుండా వదిలిపెట్టారు. అయితే నోట్ల రద్దుపై చర్చ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నోట్లరద్దుపై సభ్యులకు వివరించడానికి ఉర్జిత్ పటేల్‌ను మరోసారి కమిటీ ముందు హాజరు కావాలని కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నిషికాంత్ దూబే సహా కమిటీలోని బిజెపి సభ్యులు ఉర్జిత్ పటేల్‌ను మరోసారి పిలవడానికి ఇష్టపడకపోయినప్పటికీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో కమిటీ ముందు హాజరు కావాలని ఉర్జిత్ పటేల్‌ను కోరాలని నిర్ణయించినట్లు కమిటీ సభ్యుడొకరు తెలిపారు.