జాతీయ వార్తలు

పెట్రోల్ హోమ్ డెలివరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వాహన దారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూల్లో నిలబడ్డనక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ముందుగా బుక్ చేసుకున్నవారికి హోమ్ డెలివరీ సదుపాయం కల్పించనున్నట్టు చమురు మంత్రిత్వశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. పెట్రోలు బంకుల వద్ద భారీ క్యూలను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. మరోపక్క మేనెల 1 నుంచి పెట్రోలు ఉత్పత్తి ధరలు ఏరోజుకారోజు మారుతుంటాయి. పెట్రో ల్, డీజిల్ ధరలు పెంపు, తగ్గడం రోజురోజుకు మారతాయని స్పష్టం చేశారు. తొలుత ఈ పద్ధతి పుదుచ్ఛేరి, విశాఖపట్నం, ఉదయ్‌పూర్, జంషెడ్‌పూర్, చండీగఢ్‌లో తొలుత ప్రయోగాత్మంగా ప్రవేశపెడతారు. ప్రస్తుతం చమురు ధరలను నెలలో మొదటి రోజు అంటే 1, 16 తేదీల్లో సమీక్షిస్తున్నారు. ధర పెంచ డం, తగ్గించం ఈ రెండు తేదీల్లోనే ప్రకటిస్తారు. అంతర్జాతీయ చమురు మార్కెట్ ధరల్లో మార్పులను బట్టి 15 రోజులకోసారి ధరలపై ప్రకటన వెలువడుతుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని విశే్లషకులు చెబుతున్నారు.