జాతీయ వార్తలు

అభివృద్ధే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి ఊపుమీదున్న బిజెపి మన్ముందు అదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 13 మంది బిజెపి ముఖ్యమంత్రుల సమావేశం కీలకం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రసంగించనున్నారు. ‘సుపరిపాలన-అభివృద్ధి’ అజెండాగా సిఎంలకు మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా సమావేశంలో ప్రసంగిస్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన 13 మంది సిఎంలు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా సమావేశం జరుగుతోందని బిజెపి ప్రధాన కార్యదర్శి భుపేందర్ యాదవ్ వెల్లడించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ సిఎంలతో సమావేశం కావడం ఇది రెండోసారి.