జాతీయ వార్తలు

లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో పెరగనున్న థర్డ్ ఏసీ కోచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ బోగీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో లాంగ్ డిస్టెన్స్ (ఎక్కువ దూరం ప్రయాణించే) రైళ్లలో థర్డ్‌క్లాస్ ఏసీ బోగీల సంఖ్యను పెంచనున్నారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 10వ తేదీ మధ్య లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల్లో 17 శాతం కంటే ఎక్కువ మంది థర్డ్‌క్లాస్ ఏసి బోగీల్లోనే ప్రయాణించారని, దీంతో ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చిన మొత్తం రాబడిలో 33.65 శాతం ఆదాయం థర్డ్‌క్లాస్ ఏసీ ప్రయాణికుల నుంచే వచ్చిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి 16.69 శాతంగా ఉన్న థర్డ్‌క్లాస్ ఏసీ ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది మార్చి 10వ తేదీ నాటికి 17.15 శాతానికి, అలాగే వారి నుంచి వచ్చిన ఆదాయం 32.60 శాతం నుంచి 33.65 శాతానికి పెరగడం థర్డ్‌క్లాస్ ఏసీ బోగీలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోందన్న విషయాన్ని రుజువు చేస్తోంది.