జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఐక్యతారాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపిని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఐక్యతారాగం అందుకుంది. దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనాన్ని అడ్డుకుని, ఎన్డీయే మిత్రపక్షాల దూకుడు తగ్గించాలంటే ప్రతిపక్షాల ఐక్యత ఒక్కటే మార్గమని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా పావులు కదుపుతున్నారు. జెడి (యు) సీనియర్ నాయకుడు, ఎంపీ శరద్ యాదవ్‌ను రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే జూలై 24తో ముగుస్తుంది. ఈలోగా కొత్త రాష్టప్రతి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 24కు నెలముందే కొత్త రాష్టప్రతి ఎన్నికల ప్రక్రియ మొదలై జూలై 21 లేదా 22న నిర్వహించే ఎన్నికతో కొలిక్కివస్తుంది. పార్లమెంటు, రాష్ట్రాల ఉభయ సభల సభ్యులతోపాటు ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు రాష్టప్రతి ఎన్నికల్లో ఓటర్లు. ఉత్తరప్రదేశ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే అభ్యర్థి రాష్టప్రతి పదవికి సునాయసంగా ఎన్నికవుతారని ఆ పార్టీ భావిస్తోంది. అయితే దీనికి ప్రతిగా సోనియాగాంధీ ప్రతిపక్ష పార్టీలను ఒక తాటి పైకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో బీహార్ సిఎం నితీశ్‌కుమార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చలు జరపటంతోపాటు జెడి (యు) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి డి రాజాతోపాటు ఇతర సీనియర్లతో టెలిఫోన్ చర్చలు జరిపారు. రాష్టప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించి బిజెపికి గట్టిపోటీ ఇవ్వటంతోపాటు, రానున్న గుజరాత్, కర్నాటక,
హిమాచల్‌ప్రదేశ్ శాసన సభ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నది సోనియాగాంధీ ఆలోచన. రాష్టప్రతి ఎన్నికల్లో 775 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. రాష్టప్రతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,98,882 ఓట్లు. ఇందులో సగం 5,59,442. తమ అభ్యర్థిని రాష్టప్రతిగా గెలిపించుకునేందుకు ప్రస్తుతం ఎన్డీయేకు కేవలం 24,552 ఓట్లు తక్కువవుతున్నాయి. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటివారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బిజెపి ప్రయత్నాలను దెబ్బతీయటం ద్వారా ప్రతిపక్ష సమైక్యతను కాపాడేందుకే సోనియా ప్రతిపక్షాల సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సోనియాగాంధీ సలహా మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, జెడి (సెక్యులర్) అధినాయకుడు, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డితో చర్చలు జరిపినట్టు తెలిసింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి కూడా రాష్టప్రతి ఎన్నికతోపాటు ప్రతిపక్షాల సమైక్యత గురించి శరద్‌పవార్, ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. సోనియాగాంధీ రెండు మూడు రోజుల్లో శరద్‌యాదవ్, డి రాజా మరి కొందరు నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ప్రతిపక్షాలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి రాష్టప్రతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు.